శాసన మండలిలో తన బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగు వేయబోతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే కోటాలో జరగనున్న శాసనమండలి ఉపఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేరును అధిష్టానం ఖరారు చేసింది.  గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. దాంతో చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్వర్యంలో ఏపి అభివృద్ది జరుగుతుందని.. అభివృద్ది కాంక్షించే ఈ పార్టీలోకి వస్తున్నామని నేతలు అంటున్నారు.

 

ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా డొక్కా గురువారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ప్రతిపాదిస్తూ వైసీపీ 10మంది ఎమ్మెల్యేల సంతకాలు చేశారు. నామినేషన్‌ ప్రక్రియకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని బరిలో దించలేదు.. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: