తెలంగాణపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 891 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో, రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటింది. ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కరోనా విజృంభిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  హైదరాబాదులోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోని ఎస్ బీఐ బ్రాంచ్ క్యాషియర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ క్యాషియర్ రోజూ 100 మందికి చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. 

 

ఇప్పుడు వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటగా, వాటిలో సగానికి పైగా కేసులు హైదరాబాద్ పరిధిలోనే గుర్తించారు. దాంతో జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా బాధితుల సంఖ్య 32కి పెరిగింది. తెలంగాణలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: