జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపొరాలోని త్రాల్​ ప్రాంతంలో అకస్మాత్తుగా ఓ ఎన్కౌంటర్ ​చోటు చోటు చేసుకుంది. అప్రమత్తమైన భద్రతా దళాలు.. ముష్కరులు పై వేడైన తూటాల సెగ తో విజృంభించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.

 

 

గతంలో కూడా పుల్వామా జిల్లాలో తీవ్రవాదులు భారీ కుట్ర ప్రయత్నించగా మన బలగాలు వాటిని తిప్పికొట్టాయి.జమ్ముకశ్మీర్​ పుల్వామాలో తీవ్రవాదులు మరో ఉగ్రకుట్రకు వ్యూహాలు రచిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో దాడిని భగ్నం చేశాయి సీఆర్​పీఎఫ్​, సైనిక బలగాలు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో కూడిన కారును గుర్తించిన భద్రతా బలగాలు తగిన సమయంలో స్పందించి పేలకుండా చేయగలిగారు.

 

ఓ వాహనంలో ఐఈడీ బాంబులను అమర్చి దాడి చేయాలని వ్యూహరచన చేశారని చెప్పారు పోలీసులు. గతేడాది పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వాహనంపై చేసిన దాడి తరహాలోనే తీవ్రవాదులు మరోసారి ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఈ ఉగ్రదాడి వ్యూహ రచనలో లష్కరే, జైషే మహ్మద్​ ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వాహనంపై దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 40 మందికిపైగా సైనికులు అమరులయ్యారు.

 

 

https://twitter.com/ANI/status/1276135255590625280?s=19

 

మరింత సమాచారం తెలుసుకోండి: