బ్రెజిల్‌లో వాట్సప్ పేమెంట్స్ లాంఛ్ చేసిన వారం రోజుల్లోనే ప్రభుత్వం ఈ సేవల్ని నిలిపివేయడం సంచలనంగా మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న త‌న కోట్లాది మంది యూజ‌ర్ల‌ను సంతృప్తి ప‌రిచేలా స‌రికొత్త మార్పుల‌తో దూసుకు పోతోన్న వాట్సాప్ కొద్ది రోజులుగా వాట్సాప్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక కొద్ది రోజుల క్రిత‌మే ఇండియాలో వాట్సప్ పేమెంట్స్ సర్వీస్‌ను విజయవంతంగా లాంఛ్ చేస్తామని వాట్సప్ ప్రకటించింది. 

 

ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం బ్రెజిల్లో ప్ర‌యోగాత్మ‌కంగా వాట్సాప్ పే సేవ‌లు ప్రారంభించింది. వాట్సాప్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు వ‌చ్చిన వాట్సాప్ పే సేవ‌లు నిలిపి వేయ‌డంతో దీనిపై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న‌వారు కాస్త టెన్ష‌న్‌లో ఉన్నారు. అయితే బ్రెజిల్‌లో పేమెంట్ సేవలు నిలిపివేయడంతో అక్కడి సెంట్రల్ బ్యాంకుతో కూడా సంప్రదింపులు జరుపుతోంద‌ని తెలుస్తోంది. మన దేశంలో కూడా వాట్సాప్ వివిధ బ్యాంకుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోందట‌.

 

ఇక ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో 10 ల‌క్ష‌ల మంది యూజ‌ర్ల‌తో ఈ ప్ర‌క్రియ టెస్టింగ్ ద‌శ‌లో ఉంది. ఇది స‌క్సెస్ అయిన వెంట‌నే అంద‌రికి వ‌ర్తిపంజేస్తారు. వాట్సప్ పేమెంట్ ఫీచర్ ద్వారా ఉపయోగించి డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. ఇందుకోసం యూజర్లు తమ బ్యాంకు అకౌంట్‌ను వాట్సప్ పేమెంట్స్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ పే, గూగుల్ పే లాగే వాట్సప్ పేమెంట్స్ పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: