ప్రముఖ టైర్ల ఉత్పాదక పరిశ్రమ అపోలో టైర్స్ - ఏపీ యూనిట్ లో తొలి టైరు విడుదల చేసింది. చిత్తూరు జిల్లా చిన పాండూరు లో 2018లో ఏర్పాటైన అపోలో టైర్స్ పరిశ్రమలో వర్చువల్ సమావేశంలో పాల్గొని తొలి టైర్ విడుదల చేసారు  అపోలో టైర్స్ ఛైర్మన్ ఓంకార్ ఎస్ కన్వర్. తొలిదశలో 3800కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలో పెట్టిన అపోలో టైర్స్ భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. 

 

అపోలో టైర్స్ కి ప్రపంచంలో 7వ ఉత్పత్తి కేంద్రం కాగా... దేశం లో 5వదని ఆయన వివరించారు. 2022 నాటికి రోజుకు 15 వేల కారు టైర్లు, 3 వేల బస్సు, ట్రక్కు టైర్ల ఉత్పాదకతే లక్ష్యం గా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: