అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఇప్పుడు భారత్ ని దగ్గర చేసుకోవడానికి గానూ అమెరికా రోజు రోజుకి కూడా కొత్త కొత్త వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. తాజాగా ఒక వ్యాఖ్య చేసారు అమెరికా విదేశాంగ శాఖా మంత్రి పామ్పియో. 

 

చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి బదులివ్వడానికి మేం అవసరమైన రీతిలో బలగాలను మోహరిస్తామని జర్మనీ లో ఉన్న తమ బలగాలను భారత చైనా సరిహద్దులకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులన్నింటినీ వినియోగిస్తామని ఆయన అన్నారు. అవసరం అయితే చైనాపై అమెరికా సైనికులు దాడులు చేయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు అని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: