కరోనా లాక్ డౌన్ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం టీటీడీ కల్పించిన నేపధ్యంలో ఇప్పుడు వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కి పోటీ పడే పరిస్థితి నెలకొంది. ఇక టికెట్ లను కూడా దేవస్థానం బోర్డ్ జారీ చేస్తుంది. శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత టికెట్లు భక్తులకు జారీ చేసింది.

 

దీనితో అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ కౌంటర్‌లో భక్తులు బారులు తీరడం విశేషం. ఈనెల 30వరకు రోజుకు 3వేల చొప్పున టికెట్లు జారీ చేసారు. నేటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల దర్శనాల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉంది. నేటి నుంచి 11 వరకూ స్వామి వారి దర్శనం భక్తులకు లభించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: