మెగాస్టార్ చిరంజీవి అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో నేడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిసై బంగారంలాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని అన్నారు. యాంటీ డ్రగ్‌ ప్రచారం చేయటానికి పూనుకున్న పోలీసు వారిని, పాల్గొన్నవారిని అభినందిస్తున్నానని చెప్పారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం మానవ జన్మ... మత్తుకు బానిసై జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమా...? అని ప్రశ్నించారు. 
 
క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం అని వ్యాఖ్యానించారు. మనపై ఆధారపడిన కుటుంబాలను వీధిన పడేయటం సమంజసం కాదని చెప్పారు. దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించాలని సూచించారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? అని ప్రశ్నించారు. బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుందని సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: