దివంగత దర్శకుడు, నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి తగాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. చిన్న కుమారుడు అరుణ్ కుమార్ ఈ నెల 24న పెద్ద కుమారుడు ప్రభు ఇంట్లోకి గేటు దూకి వెళ్లి ప్రభు భార్య, మామయ్యను దుర్భాషలాడాడు. ప్రభు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఎదుట కూడా అరుణ్, అతని భార్య సునీత ఇష్టానుసారం మాట్లాడారని ప్రభు చెబుతున్నాడు. 
 
అరుణ్ కుమార్ తాగి ఇంట్లోకి వచ్చి తన భార్యపై చేయి చేసుకున్నాడని.... బీరువా కూడా తెరిచేందుకు ప్రయత్నించాడని ప్రభు చెప్పారు. మోహన్ బాబు, కల్యాణ్, మురళీమోహన్ లాంటి పెద్దలు ఆస్తి వివాదం గురించి స్పందించాలని కోరారు. చాలామంది పెద్దలను కలిసినా తన సమస్యకు పరిష్కారం దొరకలేదని.... తన కూతురు పేరు మీదున్న ఇంటిలోనే తాను ఉంటున్నానని.... ఇంటిపై కోర్టులో కేసు కూడా నడుస్తోందని ఆయన చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: