ఈశాన్య రాష్ట్రాలు కరోనా కట్టడిలో ముందు ఉన్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా అక్కడ కరోనా కట్టడి జరుగుతుంది. జనాభా తక్కువగా ఉండటమే కాకుండా, అక్కడ పరిక్షల సంఖ్యను ఎక్కువగా చేయడంతో కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి. దీనికి తోడు చిన్న రాష్ట్రాలు కావ‌డంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌తో స‌రిహ‌ద్దులు త‌క్కువుగా ఉండ‌డం.. కార్య‌క‌లాపాలు కూడా పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఇక్క‌డ కేసులు ఎక్కువుగా లేవు. 

 

ఇక ఇదిలా ఉంటే... ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ద్వారా దాడి చేయడానికి గానూ చైనా కుట్ర చేస్తుందని నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలుస్తుంది. దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు పంచుకుని ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా కేసులు తక్కువగా ఉండటంతో నేపాల్ తో కలిసి ఈ కొత్త కుట్ర‌కు చైనా ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ విష‌యం తెలిసిన నిఘా వ‌ర్గాలు ఇప్పటికే బీహార్ సరిహద్దుల్లో నిఘా పెంచారు. ఇప్పుడు అసోం, నాగాలాండ్ పై చైనా దృష్టి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: