జవహార్ లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో పులి శుక్రవారం మరణించింది. కిరణ్ అనే పేరు ఉన్న ఈ పులి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నది. ఎనిమిదేళ్ల వయసు ఉన్న తెల్లరంగు రాయల్ బెంగాల్ టైగర్ దవడ  భాగంలో ఏర్పడిన నియో ప్లాస్టిక్ కనతి  కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. 

 

 గత కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతుంది కిరణ్. ఆరోగ్యం  విషమించడంతో కిరణ్ మృతి చెందినట్లు తాజాగా జూ అధికారులు తెలిపారు. అయితే ఈ బెంగాల్ టైగర్ నెహ్రూ జూ లోనే పుట్టి పెరిగింది అని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: