ఉత్తరాది రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు భయపెడుతున్నాయి. కరోనా లేదు అనుకున్నా సరే భూకంపాలు భయపెడుతున్నాయి. హర్యానాలో వరుస భూకంపాలు ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకి అక్కడ ఎక్కడో ఒక చోట భూకంపం వస్తూనే ఉంది. తాజాగా హర్యానాలో కీలక పట్టణం అయిన రోహాతాక్ లో భూకంపం వచ్చింది. 

 

మధ్యాహ్నం 3:32 గంటలకు హర్యానా రోహ్‌తక్ సమీపంలో 2.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూకంపం ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట సంభవిస్తూనే ఉంది. నిన్న మిజోరాం తో పాటుగా నాగాలాండ్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత కనీసం 5 వరకు ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: