వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ను కలిశారు. విజయసాయిరెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ నోటీసు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి తనకు నోటీస్ ఇవ్వడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. విజయసాయిరెడ్డి పంపిన నోటీసుకు లీగల్ శాంక్టిటీ లేదని అన్నారు. అన్ని విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 
 
వైసీపీలో క్రమశిక్షణ కమిటీనే లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, విజయసాయిరెడ్డి హోదా గురించి ఆయన అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీనే లేకుండా నోటీసులు జారీ చేయడం ఏమిటని.... తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ జారీ గురించి కూడా ఫిర్యాదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: