సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా రాష్ట్రాన్ని హరిత తెలంగాణా గా మార్చడానికి గానూ సిఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో హరితమారం అద్భుతంగా జరుగుతోందని అన్న ఆయన... ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌, సర్పంచులు ఉద్యమంలాగా హరితహారాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. 

 

ఇస్లాంపూర్‌లో రెండున్నర ఎకరాల్లో మొక్కలు నాటినట్టు ఆయన వివరించారు. నాటిన మొక్కలను సంరక్షించడం ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నాయకత్వంలో అందరూ పెద్దయెత్తున మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఎంత ఎక్కువగా చెట్టు పెడితే అంత ఎక్కువగా వర్షం వస్తుందన్నారు.  హరితహారంను ప్రభుత్వ కార్యక్రమంగా ఎవరూ భావించ వద్దన్నారు ఆయన. అందరి సొంత పని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: