రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, 24 గంటలు కరెంట్ వస్తుందని తెలంగాణా మంత్రి కేటిఆర్ అన్నారు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు, రైతుబంధు అమలవుతోందన్నారు. రూ. 25వేల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయడం జరిగిందని వివరించారు. 

 

రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామన్న ఆయన... రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 46వేల చెరువులు, కుంటలు నిండాలని, వ్యవసాయంలో హరిత విప్లవం రావాలని వ్యాఖ్యానించారు. గంగ పుత్ర సోదరులకు మత్స్య సంపద పెరగాలన్న ఆయన... వాళ్లు బాగుండాలని ఆకాంక్షించారు. యాదవ సోదరులు గొర్రెల పెంపకం కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఇంత సంక్షోభంలో కూడా పేదల కోసం తాము ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడా ఆగలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: