ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మంజూరు చేసిన నిధులపై కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ అభివృద్ధికి మోదీ అనేక నిధులు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. స్థూల దేశీయ ఉత్పత్తిలో ఏపీ 9వ ర్యాంక్‌లో ఉందన్న ఆమె... ఏపీలో 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.936.16 కోట్లు వేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

 

మత్స్య సంపద యోజన కింద దేశవ్యాప్తంగా రూ.20 వేల కోట్లు ఇచ్చామని ఆమె చెప్పుకొచ్చారు. ఆక్వా, మెరైన్‌ ఫిషింగ్‌కు రూ.11 వేల కోట్లు కేటాయించామన్నారు ఆమె. కేంద్రం యూనిట్ విద్యుత్ రూ.2.70కే ఇస్తుందని... ఏపీలో యూనిట్‌కు రూ.9 ఛార్జ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. యూనిట్‌కు రూ.9 చెల్లించి ప్ర‌జ‌లు ఎలా బ‌తుకుతారు?- అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: