మొన్నటి వరకు కరోనా భయంతో అందరూ లాక్ డౌన్ పాటిస్తూ ఇంటిపట్టున ఉంటూ వచ్చారు. ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలు ఒక్కసారే గూట్లో పక్షులు రివ్వున ఎగిరి బయటకు వచ్చినట్టు వచ్చారు.  అంతే ఇప్పుడు కేసులు మళ్లీ తిరగబడుతున్నాయి. అయితే కరోనా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇక కొన్ని రోజుల నుంచి వరుసగా ప్రజా ప్రతినిధులు.. వారి బాడీగార్డు, డ్రైవర్లు కరోనా భారిన పడుతున్నారు. తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలకు కరోనా పాజిటీవ్ కేసులునమోదు అయ్యాయి.  వారి బాడీగార్డులు, డ్రైవర్లకు మాత్రమే కాదు.. ఇంటి సభ్యులకు కరోనా వచ్చింది.

 

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మనూ సింఘ్వీకి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆఫీస్ లోని సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగెటివ్ అని తేలింది. దీంతో జూలై 9 వరకూ హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఇటీవల తమిళనాడు కు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: