జగన్ సర్కార్ టీటీడీ ఎస్టేట్ అధికారి దేవేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. నిరర్థక ఆస్తులను వేలం వేసేందుకు కొన్ని రోజుల క్రితం టీటీడీ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన జగన్ సర్కార్ మీడియాకు సమాచారం లీక్ చేసిన దేవేందర్ రెడ్డిపై వేటు వేసింది. నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించడం సస్పెండ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 
 
దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ స్థిరాస్తులను ఎస్టేట్ విభాగం పర్యవేక్షిస్తుంది. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ కలిగిన దేవేందర్ రెడ్డి వేలానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. నివేదిక ఆధారంగా దేవేందర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: