మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వాటిని ఏర్పాటు చేసిన ముఠాలోని నలుగురు వ్యక్తులను అరెస్ట్​ చేయగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు.. పురుగులమందును విక్రయించి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై పీడీ యాక్ట్​ను నమోదు చేశారు. రాష్ట్రంలో నకిలీ ముఠాలు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి.

 

 

 అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ. 50 లక్షల విలువైన నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు ఉంచిన డీసీఎం వాహనం, ప్యాకింగ్​ సామగ్రిని మహబూబాబాద్​ పట్టణ పోలీసులు పట్టుకున్నారు.మహబూబాబాద్​లోని కేంద్రంలో ఓ ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకుని ముఠాలోని నలుగురు వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్​ చేసి పీడీ యాక్ట్​ నమోదు చేయనున్నట్లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: