తప్పింది అనుకున్న మిడతల దండు ముప్పు మళ్ళీ మొదలయింది. రాజస్థాన్ గ్రామాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన మిడతల దండు చుక్కలు చూపిస్తుంది. ఎక్కడో ఒక చోట ఆవి దాడి చేస్తూనే ఉన్నాయి అని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి మళ్ళీ అవి సరిహద్దుల ద్వారా వచ్చేసాయి. 

 

రాజస్థాన్ లో మిడుత దండు చోములోని హస్తేదా గ్రామంపై దాడి చేశాయని అక్కడి రైతులు పేర్కొన్నారు. షీష్‌ పాల్ అనే రైతు ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మిడుతలు మా గ్రామంపై 4 వ సారి దాడి చేశాయి. అవి మా పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. మాకు కొంత ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అతను పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: