కరోనా దెబ్బకు ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థ ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతుందో అందరికి తెలిసిందే. ఆర్ధిక కష్టాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో దాదాపుగా ఉన్నాయి అని చెప్పాలి. ఈ నేపధ్యంలో విజయవాడ ఎంపీ కేసినేని నానీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్థిక మాంద్యంతో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. 

 

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన వివరించారు. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు కుదేలయ్యాయని  ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆదాయం లేకపోవడంతో తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన వివరించారు. పేదలకు నెలకు రూ.8 వేలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: