ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. వలస కార్మికులకు అండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. మరణించిన వలస కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా విపత్కర కాలంలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళంకు చెందిన ఒకరు మరణించారని ఆయన పేర్కొన్నారు. మరణించిన రంగన్న, మహేశ్వరి, అప్పల రాజులకు ఇప్పటికైనా ఎక్స్ గ్రేషియా అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేసారు. 

 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు హుటాహుటిన ఎక్స్‌గ్రేషియా అందించిన ప్రభుత్వం వలస కార్మికుల పట్ల అలసత్వం వహించడం మంచి పద్ధతి కాదని అన్నారు. వలస కార్మికుల ఉపాధిపై కేంద్ర ప్రభుత్వం రు.50 వేల కోట్లతో ప్రవేశపెట్టిన పథకాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు వర్తింపజేయాలని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: