దేశంలో కరోనాతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక నష్టం కూడా తీవ్ర స్థాయిలో ఉంది.  ఇక ప్రయివేట్ ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేస్తున్న తీరు పట్ల తెలంగాణ సర్కారు అసంతృప్తి వ్యక్తం చేసింది. నెగటివ్ ఉన్న వారికి కూడా పాజిటివ్ అని రిపోర్టులు ఇస్తున్నట్లు ఎక్స్‌పర్ట్ కమిటీ విచారణలో తేలిందని పేర్కొంది. కరోనా సోకని వారికి సైతం ప్రయివేట్ ల్యాబ్‌లు పాజిటివ్‌గా రిపోర్ట్ ఇస్తున్నాయని ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దాంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలకు బ్రేక్ పడింది. 

 

కరోనా టెస్టులు చేయడంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది.    ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం కరోనా పరీక్షలను లాభాపెక్షతో చూడొద్దని ప్రైవేటు ల్యాబ్‌లను హెచ్చరించింది.  ప్రయివేట్ ల్యాబ్‌ల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని, స్టాఫ్ పీపీఈ కిట్లు ధరించడం లేదని.. పరిశుభ్రత సరిగా లేదని ఎక్స్‌పర్ట్ కమిటీ తెలిపిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: