ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌ద‌ల‌కుండా కమ్మేస్తోంది. అమెరికా నుంచి యూర‌ప్‌, ఆసియా దేశాల వ‌ర‌కు ఏ దేశాన్ని కూడా క‌రోనా వైర‌స్ వ‌ద‌ల‌డం లేదు. క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచ స్వ‌రూప‌మే మారిపోయింది. యూర‌ప్ దేశాల్లో శ‌వాలు కుట్ట‌లు కుట్ట‌లుగా పేరుకు పోతున్నాయి. ఇక ఈ వైర‌స్ ఇప్ప‌టికే క్రీడా రంగానికి కూడా చేరువైంది. ప‌లువురు క్రికెట‌ర్ల‌కు క‌రోనా సోకింది. ఇక పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ల‌ను క‌రోనా క‌ల‌వ‌ర పెడుతోంది. 

 

పాక్ జ‌ట్టులో ముందుగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ రూపంలో ఓ వికెట్ పడగా... అనంతరం మరో మూడు వికెట్లు పడ్డాయి. ఇప్పుడిక తాజాగా మరో ఏడు వికెట్లు రాలిపోయాయి. ఇక పాక్ క్రికెటర్ హఫీజ్‌కు మళ్లీ కరోనా సోకింది. గ‌తంలో క‌రోనాకు గురైన హ‌ఫీజ్ కోలుకోగా ఇప్పుడు మ‌ళ్లీ అత‌డికి క‌రోనా రావ‌డంతో పాక్ క్రికెట్ బోర్డు, క్రీడాభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: