దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఎలా పెరిగిపోతుందో ?  చూస్తూనే ఉన్నాం. ఈ నేప‌థ్యంలోనే దేశ వ్యాప్తంగా కరోనా పరిక్షల సంఖ్యను పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇప్పుడు దాదాపు 2 లక్షల 20 వేలకు పైగా కరోనా పరీక్షలను చేస్తున్నారు. ఇక ఈ పరిక్షల సంఖ్యను ఇంకా పెంచాలి అని భావిస్తున్నారు. మహారాష్ట్ర సహా దక్షిణ భారత దేశంలో ఇప్పుడు కరోనా పరీక్షలను పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. 

 

దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు 80 లక్షల పరిక్షలు చేసారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక లో కనీసం ప్రతీ రోజు 30 వేల వరకు పరీక్షలను నిర్వహించాలి అని భావిస్తున్నారు. ఐసిఎంఆర్ త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి అని భావిస్తున్నారు. కాగా ఢిల్లీలో కరోనా పరీక్షలను  రోజుకు 20 వేలకు పైగా నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: