తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అడ‌వుల సంర‌క్ష‌ణ‌, అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధ‌ాన్య‌త‌ ఇస్తున్నట్టు తెలంగాణా అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆయన శ‌నివారం గండిరామ‌న్న హ‌రిత వ‌నంలో హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అడవుల‌ను ర‌క్షించ‌డ‌మే కాకుండా.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు ద‌గ్గ‌ర‌లో నిరూప‌యోగంగా ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్ బ్లాకుల‌ను ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

 

న‌గర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు దోహదం చేస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: