తమ సైనికులను చంపడానికి రష్యా కుట్ర చేస్తుందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. అఫ్ఘానిస్తాన్‌లోని అమెరికా సైనికులు, ఇతర దేశాల సంయుక్త దళాలను చంపడానికి గానూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు రష్యా సైన్యం నిధులు ఇచ్చింది అని గుర్తించారు. ఈ మేరకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇప్పటికే నివేదిక అందించారు. 

 

ఐరోపా దేశాల్లో అమెరికా సైనికులపై జరిగిన దాడి వెనుక కూడా రష్యా హస్తం ఉండి ఉండవచ్చు అని అధికారులు భావించారు. దీనికి సంబంధించి భారీగా నిధులను రష్యా ఇచ్చింది అని అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. అయితే దీనిపై వైట్ హౌస్ నుంచి గాని  అమెరికా ప్రభుత్వం నుంచి గాని ఏ విధమైన సమాచారం రాలేదు. అక్కడి మీడియాలో ఈ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: