హైదరాబాద్ లో టీవీ సీరియల్ షూటింగ్ లను రద్దు చేసే ఆలోచనలో ఉంది అక్కడి సర్కార్. షూటింగ్ ల కారణంగా కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో షూటింగ్ ల విషయంలో వెనక్కు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఒక సీరియల్ యూనిట్ మొత్తానికి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం తో కరోనా కేసులు సోకాయి. 

 

ఇక ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తే అదో తల నొప్పి అని భావిస్తున్న తెలంగాణా సర్కార్ షూటింగ్ లను రద్దు చేసే ఆలోచనలో ఉంది. 14 రోజుల పాటు షూటింగ్ లను వాయిదా వేసుకోవాలని కోరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో భారీగా కేసులు నమోదు వుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: