భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 18,552 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.
 

అదే సమయంలో 384 మంది మరణించారు.  ఇప్పటివరకు మొత్తం 5,08,953కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 15,685కి పెరిగింది. 1,97,387 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,95,881 మంది కోలుకున్నారు.  ఇక కరోనా వైరస్‌ మహారాష్ట్రలో తీవ్ర రూపం దాలుస్తుంది. రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 175 మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,441కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 6,931 మంది మృతి చెందారు.

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం  పటిష్ట చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  కరోనా బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతున్నవారు 65,893 మంది. చికిత్స పొంది కోలుకున్న వారు 77,453 మంది ఉన్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: