ఏపీలో విద్యుత్ చార్జీలపై కకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  ప్రధాన సలహాదారు కౌంటర్ ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 2 వేల కోట్లకు పైగా ఆదా చేసామని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీల విషయంలో నిర్మల  చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ఆయన అన్నారు. 

 

ఏపీలో పారిశ్రామిక విద్యుత్ చార్జీలు యూనిట్ 7.65 పైసలు టారిఫ్ అని ఆయన పేర్కొన్నారు. వినియోగం ఆధారంగా వసూలు చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఏపీపై 1700 కోట్లు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. 80 శాతం ఉద్యోగాలను బడుగు బలహీన వర్గాలకు అందించామని ఆయన వివరించారు. కేంద్రం 2. 75 పైసలకే విద్యుత్ ఇస్తుందని చెప్పడం అవాస్తమని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: