ఉత్తరాది రాష్ట్రాలను మిడతలు కంగారు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, అక్కడి నుంచి హర్యానా వైపు గా వెళ్ళిన ఎడారి మిడతల దెబ్బకు ఇప్పుడు అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇక తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేసారు. 

 

రాజస్థాన్ హర్యానా రాష్ట్ర  ప్రజలు మిడతల దెబ్బకు బాగా ఇబ్బంది పడుతున్నాయని కాబట్టి ప్రభుత్వాలకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాలి అని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం గుర్గావ్‌ వైపు వచ్చిన మిడతలు... మధ్యాహ్నం నాటికి ఫరీదాబాద్‌లోకి ప్రవేశించి ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తాయని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు గుర్గావ్‌లోని డిఎల్‌ఎఫ్ ఫేజ్ 1, ఎంజి రోడ్ వద్ద ఈ మిడతలను గుర్తించారు. అయితే గుర్గావ్ జిల్లాలో పంటలకు మిడతల నుంచి ఏ రాష్ట్రం రాలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: