తన కెరీర్ పై టీం ఇండియా టెస్ట్ ఆటగాడు పుజారా కీలక వ్యాఖ్యలు చేసాడు. తన కెరీర్ నేడు ఇలా ఉండటానికి ప్రధాన కారణం రాహుల్ ద్రావిడ్ అని అతను చెప్పుకొచ్చాడు. తనను ద్రావిడ్ తో పోల్చడం నిజంగా అద్రుష్టంగా భావిస్తున్నా అన్నాడు. ద్రవిడ్‌ పైన తనకు ఉన్న అభిమానాన్ని ఒక్క మాటలో చెప్పలేను అంటూ అతను వ్యాఖ్యానించాడు. 

 

ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చకున్నానని పుజారా చెప్పుకొచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ లో ఈ స్థాయిలో ఉనటానికి ద్రావిడ్ ఒక కారణమని అన్నాడు. ఒక ఇంటర్వ్యులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసాడు. ద్రావిడ్ సలహాలు సూచనలు కెరీర్ కి చాలా బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పాడు. ఎన్నో విషయాలు ద్రావిడ్ నుంచి తాను నేర్చుకున్నా అని పుజారా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: