కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు  పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే కరోనా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలను కూడా కంగారు పెడుతుంది. పలు రాష్ట్రాల్లో సిఎం ఆఫీసులను కూడా కరోనా తాకింది. 

 

దీనితో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. తాజాగా పుదుచ్చేరి సిఎం ఆఫీస్ ని మూసి వేసారు అధికారులు. శనివారం సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు వెల్లడి అయింది. దీనితో రెండు రోజుల పాటు ఆఫీస్ ని మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆఫీస్ ని సీల్ చేసారు. ఆఫీస్ ని శానిటైజ్ కూడా చేసి సిబ్బంది అందరిని క్వారంటైన్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: