భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. “తన జాతి ప్రజలను సంక్షోభం నుండి గట్టెక్కించిన నాయకులను చరిత్ర మరచిపోదు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థికరంగానికి దిశానిర్దేశం చేసి, ప్రపంచదేశాలతో పోటీపడే స్థాయికి భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా పీవీ నరసింహారావుగారు చరిత్రలో నిలిచిపోయారు. 

 

అటువంటి తెలుగు ఆణిముత్యం పీవీ నరసింహారావుగారికి దేశ రాజధానిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం హయాంలో 2014లో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఫలితంగా ఆయన మరణించిన పదేళ్ళకు ఢిల్లీలోని ఏక్తాస్థల్ వద్ద పీవీ స్మారక చిహ్నం నిర్మించబడింది ఆర్థిక సంస్కరణలతో  దేశ గమనాన్ని ప్రగతిపూర్వక మలుపుతిప్పిన పీవీ నరసింహారావుగారికి భారతరత్న ఇవ్వడం సముచితం. ఈరోజు పీవీ జయంతి సందర్భంగా దేశానికి, తెలుగువారికి, సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నాను” అంటూ ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: