దేశంలో వర్షాలు కురుస్తున్నా సరే కరోనా వైరస్ విషయంలో ఏ మార్పులు ఉండవని ఎయిమ్స్ వెల్లడించింది. తేమ వాతావరణంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అని ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నారు. అయితే అది నిజం కాదని చెప్పారు ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.

 

రుతుపవనాల రాకతో క‌రోనా వ్యాప్తి విష‌యంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తాము అనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వేసవిలో కరోనా ఉండదు అని అన్నారు అని కాని అలా జరగలేదన్నారు ఆయన. ఇప్పుడు వైద్యులు తమ చికిత్సలో మార్పులు చెయ్యాల్సి ఉంటుందని చెప్పారు. సీజనల్ వ్యాధులు అయిన డెంగ్యూ చికెన్ గున్యా వంటివి వస్తాయని వీటి లక్షణాలు కరోనాకు దగ్గరగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: