మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నో రంగాల్లో సంస్కరణలు తీసుకుని వచ్చారని వాటి ఫలితాలను నేడు మనం చూస్తున్నామని  తెలంగాణా సిఎం కేసీఆర్ అన్నారు. ఆసియ దేశాలు అన్నీ కూడా భారత్ వైపు చూసేలా చేసారని ఆయన అన్నారు. పీవీకి భారత రత్న ఇవ్వాలి అని శాసన సభలో, కేబినేట్ లో తీర్మానం ఆమోదించి పమోస్తామని కేసీఆర్ అన్నారు. 

 

పీవీ ముద్రిత రచనలు అన్నీ కూడా ముద్రించి తెలంగాణాలో అన్ని విశ్వ విద్యాలయాలకు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పీవీ చిత్ర పటాన్ని కచ్చితంగా పార్లమెంట్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. చాలా మంది మాజీ ప్రధానులకు దక్కిన గౌరవం పీవీకి దక్కలేదు అని కేసీఆర్ అన్నారు. క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అని కేసీఆర్  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: