ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల ధరలు పెరగడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. పేదలను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది అంటూ మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. 

 

కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటుంది ''యుశ్రారైకాపా'' ప్రభుత్వం అంటూ ఆయన ఆరోపణలు చేసారు. దానికి నిదర్శనమే రివర్స్ టెండర్  వైఎస్ జగన్ ,పేదలకు ఇచ్చే రేషన్‌ సరుకుల ధరలను భారీగా పెంచడం అని ఆరోపించారు. కందిపప్పు పై కిలోకు రూ.27, పంచదారపై కిలోకు రూ.14 ఒకేసారి పెంచేసిందని మండిపడ్డారు. దీనివల్ల సంవత్సరానికి పేదలపై 600 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: