భారత్‌లో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,906 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 410 మంది మరణించారు. 2,03,051 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,713 మంది కోలుకున్నారు. ఈ మద్య వరుసగా రాజకీయ నేతలకు కరోనా పాజిటీవ్ వస్తున్న విషయం తెలిసిందే.

 

ఈ కారణంగా చనిపోయిన  నేతలు కూడా ఉన్నారు. తాజాగా గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా (79)కు కరోనా పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. 

 

శంకర్ వాఘేలా 1996 నుంచి 97 వరకు సీఎంగా పని చేశారు. ఎన్సీపీ మాజీ ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. ‘బాపు’గా అక్కడి ప్రజలకు ఆయన సుపరిచితులు. కాగా గుజరాత్‌లో ఇప్పటికే వైరస్ తీవ్రంగా వ్యాపించింది. 30,709 వైరస్ బారిన పడ్డారు. 1,789 మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: