'ఉయ్యాలా జంపాలా' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పునర్నవి బిగ్ బాస్ షోలో రాహుల్‌తో రొమాన్స్ పండించి షోకు క్రేజ్ తెచ్చారు. బిగ్ బాస్ కు ముందు పునర్నవి ఎన్నో సినిమాల్లో నటించినా ఆమెకు క్రేజ్ మాత్రం ఈ షోతోనే వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత పునర్నవి ‘ఒక చిన్న విరామం’ సినిమాలో నటించినా ఆ సినిమా హిట్ కాలేదు. పునర్నవి భూపాళం మరోమారు బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పునర్నవి బిగ్‌బాస్ హౌస్‌లో లోపల ఎంతో జరుగుతుందని కానీ షో నిర్వాహకులు మాత్రం ఎడిట్ చేసి వాళ్లకు అవసరమైన దాన్నే బయటకు చూపిస్తారని వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు కూడా వాళ్లు చూపించేదే నిజమనే భ్రమలో ఉంటారని అన్నారు. షోలో కొంతమందితో గొడవలు జరిగినా బయటకొచ్చిన తర్వాత మాత్రం తనతో హౌస్‌లో ఉన్న అందరితోనూ టచ్‌లో ఉన్నట్టు ఆమె తెలిపారు. బిగ్ బాస్ షోలో జరిగేది ఒకటి చూపించేది మరొకటి అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: