దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి నియంత్రణలో సక్సెస్ కాలేకపోతున్నాయి. కరోనా రోగులలో సాధారణంగా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయనే సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ జాబితాలోకి కొత్తగా మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ లక్షణాలను గుర్తించారు. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కరోనా లక్షణాలేనని ఈ లక్షణాలు కనిపించిన వారు పరీక్షలు చేయించుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ సోకిన రెండు రోజుల నుంచి పద్నాలుగు రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయని వారు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: