దేశ వ్యాప్తంగా  ఇప్పుడు కరోనా కేసులు ప్రజా ప్రతినిధులను కంగారు  పెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. ప్రతీ రోజు కరోనా ఎవరో ఒక ప్రజా ప్రతినిధికి సోకుతూనే ఉంది. తాజాగా బీహార్ మంత్రి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

బీహార్ మంత్రి ఒకరికి కరోనా పరిక్షలు చేయగా ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీనితో ఆయన కటిహార్‌లో నిర్బంధంలో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. దీనితో ఆయన శాఖ అధికారులు, ఆయనతో కలిసిన పలువురు ఎమ్మెల్యేలు హోం క్వారంటైన్ కి వెళ్ళారు. బీహార్ సిఎం నితీష్ కుమార్ యాదవ్ ని కూడా ఆయన కలిసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: