దాతలు ఇచ్చిన విరాళాలు తీసుకోవడానికి మాత్రం సీఎం కేసీఆర్‌ ముందుంటారని తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టిమ్స్ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదు అని ఆయన నిలదీశారు. ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్కలేదని ఆయన మండిపడ్డారు. వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శలు చేసారు. ప్రెస్‌మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకున్నారని... 

 

కానీ చేసింది శూన్యమని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. ఎక్కువగా కరోనా టెస్ట్‌లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. వైద్య సిబ్బందిని ఎందుకు నియమించడం లేదు? అని నిలదీశారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు పెట్టాలని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: