మహారాష్ట్రలో కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. కరోనా కట్టడికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రయత్నాలు చేసినా సరే కరోనా మాత్రం దాని పని అది చేస్తుంది. 

 

ఇక ఇదిలా ఉంటే కరోనా మహారాష్ట్రలోని అకోలా జైలులో 50 మందీ ఖైదీలకు కరోనా సోకింది అని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ జైలు లో మొత్తం 300 మంది వరకు ఖైదీలు ఉన్నారు అని వారు అందరికి కరోనా పరిక్షలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని అక్కడి అధికారులు వెల్లడించారు. జైలు సిబ్బందిని క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: