చైనాతో ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర౦, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. తాజాగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. భారత వ్యతిరేక ప్రాపగండా చేస్తున్న వారిని తాము ఎదుర్కోగలమంటూ ఆయన రాహుల్ ని ఉద్దేశించి అన్నారు. 

 

కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడై ఉండి రాహుల్ గల్వాన్ ఘర్షణను రాజకీయం చేయాలని చూడటం దారుణమని ఆయన మండిపడ్డారు. సరెండర్ మోదీ అంటూ రాహుల్ చేసే ప్రకటనలు చైనా, పాకిస్థాన్‌లను ప్రోత్సహించేవిగా, భారత ప్రభుత్వాన్ని కించపరిచేవిగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కొందరి వక్రబుద్ధి అలాగే ఉంటుందన్నారు. అసలు పార్లమెంట్ లో తేల్చుకుందాం రా అంటూ రాహుల్ కి ఆయన సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: