తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది. వైద్య సదుపాయాలను పెంచే దిశగా అడుగులు వేస్తుంది. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడించారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వేలాది బెడ్లు సిద్ధం చేశామని మంత్రి ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 

 

అదే విధంగా సీరియస్‌గా ఉన్నవారికే ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వ్యాధి లక్షణాలు లేనివారికి ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచనలు చేసారు. తెలంగాణ కరోనా మృతుల సగటు 1.52 శాతం మాత్రమే ఉందన్నారు ఆయన. తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈటల ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: