కరోనా కేసులతో అల్లాడుతున్న మహారాష్ట్రలో మహారాష్ట్రలో ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి సర్కార్ సిద్దమైంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్లాస్మా థెరపీ చికిత్సలు పెద్దఎత్తున చేపడుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచే అవకాశం ఉంది అని ఆయన పేర్కొన్నారు. 

 

కోవిడ్ నుంచి విముక్తి పొంది, స్వస్థత చేకూరిన వారు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాపై జరుపుతున్న పోరాటానికి సహకరించాలని ఈ సందర్భంగా సిఎం ప్రజలను కోరారు. వైద్యులు అందరికి ధన్యవాదాలు చెప్తున్నామని ఆయన అన్నారు. మహారాష్ట్రలో కరోనా కారణంగా రైతు రుణ మాఫీ విషయంలో జాప్యం జరిగింది అని ఆయన వెల్లడించారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: