విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఘటనలో సీఎం  వైఎస్ జగన్ స్వయంగా పరిహారం ప్రకటించారని కాని ఆగ్రో విషయంలో మాత్రం అలా జరగడం లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆగ్రో విషయంలో అధికారులతో బేరసారాలు ఆడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేసారు. 

 

ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీని లీజుకు తీసుకున్న ఎంపీ ఎవరు? అని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ఎంపీ మద్యం తయారు చేయడమేంటని ఈ సందర్భంగా నిలదీశారు. పంచ భూతాలను అమ్ముకోడానికే రాజకీయాల్లోకి వచ్చారా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో మద్యం క్వాలిటీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా అయన సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: