మహారాష్ట్రలోని అకోలా జైలులో ఇప్పుడు కరోనా కేసులు బయటపడటం సంచలనంగా మారింది. అయితే ముందు 50 మంది ఖైదీలకు కరోనా వచ్చింది అని ప్రకటించినా సరే కాదు  ఇంకా ఎక్కువే అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అకోలా జైలులో 68 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది అని అధికారులు పేర్కొన్నారు. 

 

వారిలో చాలా మందికు కరోనా లక్షణాలు లేవు అని అధికారులు పేర్కొన్నారు. దీనిపై మాట్లాడాని అకోలా జిల్లా డిప్యూటి కలెక్టర్ సంజయ్ ఖాడ్సే జైలు లోపల ఐసోలేషన్ వార్డులు చేశారని వివరించారు. ఖైదీలను జాగ్రత్తగా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయని సంజయ్ ఖాడ్సే చెప్పుకొచ్చారు. ఇతర ఖైదీలకు కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. జైలు సిబ్బందిని క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: