దేశంలో మార్చి నెల నుంచి కరోనా కేసులు పెరిగిపోతవడంతో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు. అంతే కాదు వారిని బయటకు రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించారు. మరోవైపు డాక్టర్లు ఇతర వైద్య బృందం ఎడతెరిపి లేకుండా శ్రమిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే పోలీసులు, డాక్టర్లు పలువురు కరోనా భారిన పడి చనిపోయిన విషయం తెలిసిందే. 

 

తాజాగా రాజధాని ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అసీమ్ గుప్తా విధుల‌లో ఉండ‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. వెంటనే ఆయనను మాక్స్ ఆసుపత్రిలో చేరారు, అక్కడ ఐసియులో చికిత్స పొందుతూ మృతిచెందారు. అసీమ్ గుప్తా అనస్థీషియా వైద్యునిగా ఎంతో పేరు సంపాదించారు. దేశంలో ప్ర‌స్తుతం కరోనా రోగుల సంఖ్య 5,28,859కు చేరుకుంది. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటివరకు 16,095 మంది మృతిచెందారు.

 

చికిత్స అనంత‌రం 3,09,713 మంది కోలుకున్నారు. రాజధానిలో కరోనా రోగుల సంఖ్య 80 వేల 188కు పెరిగింది. ఇక్క‌డ‌ మొత్తం మృతుల‌ సంఖ్య 2,558కి చేరుకుంది.  గత 24 గంటలలో దేశంలో కొత్త‌గా 19,906 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో 410 మంది మృతిచెందారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: