కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ట్రాయ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ట్రాయ్  ఒక యాప్ ని విడుదల చేసింది. అది ఏంటీ అంటే... మనం చూడాలనుకున్న ఛానళ్ళను ఎంపిక చేసుకోవడంతో బిల్లును భారీగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది. 

 

కేబుల్ టీవీ లేదా డీటీహెచ్‌లో చూడాలని భావించే వాళ్ళు... ఛానెళ్లను సెలెక్ట్ చేసుకుంటే ఎంత బిల్ అవుతుందో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. టాటాస్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్‌టీవీ, డీ2హెచ్, హాత్‌వే డిజిటల్, సిటీ నెట్వర్క్‌, ఏషియానెట్, ఇన్‌డిజిటల్ వంటి డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఎంఎస్‌ఓల వివరాలు అన్నీ ఉంటాయి. ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వివరాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: